హనుమకొండ, మే 8 (ఆంధ్రజ్యోతి): యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) వ్యాఖ్యానించారు. యువత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
టాలెంట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్‌మేళా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ సత్యశారదదేవి పాల్గొన్నారు. ఈ జాబ్‌మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. సమాజంలో ఇప్పటి జనరేషన్‌లో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. మనం తప్పు చేయనంతవరకూ ఎవరికీ భయపడొద్దని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
యువత ఒత్తిడికి లోనుకావొద్దు: ఎంపీ కడియం కావ్య
యువత ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యానించారు. నిత్యం మనలో మనం యుద్ధం చేసుకోవాలని అన్నారు. యువత ఉద్యోగాల ప్రయత్నాలను ఆపొద్దని చెప్పుకొచ్చారు. యువత కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు.
ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయి: నాగరాజు
ఏఐ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. నేటి పోటీని తట్టుకుని నిలబడాలని అన్నారు. ఉద్యోగం ఎక్కడైనా చేసేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఆర్మీలో తెలంగాణ యువత ప్రాతినిధ్యం తక్కువ అని తెలిపారు. ఉద్యోగం రావాలంటే నైఫుణ్యం కలిగి ఉండాలని అన్నారు. ప్రైవేటు ఉద్యోగంలో రాణించాలంటే స్కిల్స్ ముఖ్యమని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రుల కళలు నెరవేరాలంటే కష్టపడాలని సూచించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు.
.
మంత్రిగా ఉండి ఇలా మాట్లాడతారా.. కొండా సురేఖపై రాజాసింగ్ ఫైర్
రైతుబంధు ఎగ్గొట్టింది బీఆర్ఎస్.. ఇచ్చింది రేవంత్ సర్కార్: తుమ్మల
రోడ్డు భద్రత, డిజిటల్ సేవల్లో తెలంగాణ ఆదర్శం: కేంద్ర మంత్రి గడ్కరీ
Read Latest Telangana News And AP News And International News And Telugu News

