Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్నికల్లో అరాచకాలు, రిగ్గింగ్‌కి మారుపేరు జగన్: మాజీ ఎమ్మెల్యే వర్మ

ఎన్నికల్లో అరాచకాలు, రిగ్గింగ్‌కి మారుపేరు జగన్: మాజీ ఎమ్మెల్యే వర్మ

కాకినాడ, నవంబర్ 08: ఎన్నికల్లో అరాచకాలు, రిగ్గింగ్‌కి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మారుపేరు అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్.

వర్మ అభివర్ణించారు. ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉండడం వల్లనే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని వివరించారు. గత వైసీపీ పాలనలో సాక్షాత్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు భద్రత లేదని వాపోయారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన మొరపెట్టుకుంటే.. కేంద్ర బలగాలు రక్షణ కల్పించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీన్నిబట్టి గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

నాడు అక్రమాలు, అరాచకాలతో చెలరేగిపోయిన ఆయన నేడు లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తున్నారంటూ వైఎస్ జగన్‌ వైఖరిపై ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నిప్పులు చెరిగారు. అప్పట్లో పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి 500 మందితో దాడికి వచ్చిన మాట వాస్తవమా? కాదా? అని ఈ సందర్భంగా వైసీపీ అధినేతను టీడీపీ సీనియర్ నేత వర్మ సూటిగా ప్రశ్నించారు. అప్పట్లో టీడీపీ నాయకుల మీద దాడి చేసి.. కార్ల అద్దాలు పగలగొట్టారంటూ వైసీపీ నేతల తీరును ఆయన ఎండగట్టారు. కానీ నేడు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పుష్ప స్టైల్‌లో మద్యం స్మగ్లింగ్.. బొలెరో పైభాగంలో బాటిళ్లు చూసి పోలీసుల షాక్

ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 13న షెడ్యూల్

For More AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy