Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌సీపీసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి..

ఎన్‌సీపీసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యాహక్కు చట్టం (RTE) అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ముఖ్యంగా పాఠశాలల్లో 25 శాతం RTE కోటా సీట్ల భర్తీకి సంబంధించిన వివరాలను సమర్పించడంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR) వ్యవహరించిన తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

NCPCR దాఖలు చేసిన అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. కమిషన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారని, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అవసరమైతే NCPCR చీఫ్‌ను స్వయంగా కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది.

కేవలం డేటాను సేకరించడం కాకుండా.. RTE చట్టం అమలును పర్యవేక్షించడం, సంబంధిత సంస్థల నుంచి వివరాలు సేకరించి అమలులో లోపాలను గుర్తించడం కూడా NCPCR బాధ్యతల్లో భాగమేనని సుప్రీం పేర్కొంది. పేద, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకురావడమే RTE చట్టం ప్రధాన లక్ష్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.

శ్రీ చరణి సంచలనం.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి రికార్డ్..

ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు: కర్ణాటక హైకోర్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy