Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

అమరావతి, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి.

మంత్రి నారా లోకేశ్ సమక్షంలో పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో భారీగా అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తం రూ.1,57,607 కోట్ల విలువైన 35 ఒప్పందాలు జరగ్గా.. వీటి ద్వారా రాష్ట్రంలో 52,956 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 30 ఎంఓయూలు, 5 జీఓల ద్వారా ఈ పెట్టుబడులు రానున్నాయి. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడనుంది.

మెగా ఇంజనీరింగ్, క్లీన్ మ్యాక్స్ భారీ పెట్టుబడులు..

ఈ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్, హెల్త్‌కేర్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ఆసక్తి చూపించాయి. మెగా ఇంజనీరింగ్ సంస్థ మూడు ఎంఓయూల ద్వారా ఏకంగా రూ.39,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ పెట్టుబడులతో 12,940 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.41 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యునైటెడ్ టెలికం లిమిటెడ్ సైతం రూ.9,053 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. తొలిరోజే ఈ స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు కుదరడంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తాయని సదస్సు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయలు, జిఓ ఎక్స్చేంజిల వివరాలు..

1. రష్మీ మెటలర్జికల్ - రూ.18,500 కోట్లు పెట్టుబడి - 10,000 ఉద్యోగాలు

2. రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ - రూ.8,500 కోట్లు పెట్టుబడి - 800 ఉద్యోగాలు

3. రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ - 42 కోట్లు పెట్టుబడి - 1,500 ఉద్యోగాలు

4. N.A.N మాగ్నెటెక్ - 3,000 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

5. N.A.N సెలాక్స్ గ్రీన్‌మెట్ - 1,800 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

6. వెల్సపన్ గ్రూప్ - 2,500 కోట్లు పెట్టుబడి - 3,500 ఉద్యోగాలు

7. ఎవర్‌వోల్ట్ సోలార్ టెక్నాలజీ - 2,350 కోట్లు పెట్టుబడి - 1,200 ఉద్యోగాలు

8. మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రా - 2,300 కోట్లు పెట్టుబడి - 1,500 ఉద్యోగాలు

9. MEIL-ఎక్విప్‌మెంట్ స్కిడ్స్ - 1,100 కోట్లు పెట్టుబడి - 2,500 ఉద్యోగాలు

10. మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రా - 36,000 కోట్లు పెట్టుబడి - 8940 ఉద్యోగాలు

11. హీరో మోటర్ కార్ప్ - 1,457 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

12. పిఫైజర్ హెల్త్ కేర్ - రూ.983 కోట్లు పెట్టుబడి - 150 ఉద్యోగాలు

13. బ్లూజెట్ హెల్త్ కేర్ - 500 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

14. ట్రైఫోస్ పవర్ - రూ.500 కోట్లు పెట్టుబడి - 200 ఉద్యోగాలు

15. రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ - 300 కోట్లు పెట్టుబడి - 300 ఉద్యోగాలు

16. రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ - 250 కోట్లు పెట్టుబడి - 300 ఉద్యోగాలు

17. సిటోటో డిజిటల్ పర్సనాలిటీ - 250 కోట్లు పెట్టుబడి - 230 ఉద్యోగాలు

18. ప్రీమియర్ ఎనర్జీస్ - 100 కోట్లు పెట్టుబడి - 75 ఉద్యోగాలు

19. డెల్టాక్స్ - 42 కోట్లు పెట్టుబడి - 110 ఉద్యోగాలు

20. క్లీన్ మాక్స్ ఇన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ - 41,000 కోట్లు పెట్టుబడి - 600 ఉద్యోగాలు

21. రేస్ పవర్ - 9,660 కోట్లు పెట్టుబడి - 500 ఉద్యోగాలు

22. రేస్ ఫ్యూయల్స్ - 3,000 కోట్లు పెట్టుబడి - 80 ఉద్యోగాలు

23. యునైటెడ్ టెలికామ్స్ - 9,053 కోట్లు పెట్టుబడి - 1,200 ఉద్యోగాలు

24. MNL సొల్యూషన్స్ - 750 కోట్లు పెట్టుబడి - 500 ఉద్యోగాలు

25. క్లారస్ ఎనర్జీ - 100 కోట్లు పెట్టుబడి - 50 ఉద్యోగాలు

26. ఫ్యాబ్రిక్ - 4,300 కోట్లు పెట్టుబడి - 10,000 ఉద్యోగాలు

27. SLN కాఫీ - 2,500 కోట్లు పెట్టుబడి - 1,400 ఉద్యోగాలు

28. మానే గ్లోబల్ - 120 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు

29. డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ - 140 కోట్లు పెట్టుబడి - 140 ఉద్యోగాలు

30. ది పార్క్ హోటల్ - 115 కోట్లు పెట్టుబడి - 150 ఉద్యోగాలు

జీఓ ఎక్సేంజ్ ద్వారా ఒప్పందాలు..

1. ఎం వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ - 3,078 కోట్లు పెట్టుబడి - 1,300 ఉద్యోగాలు

2. జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్స్ - 1,533 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు

3. ఓషిఆర్ గ్రీన్ ఫ్యుయిల్స్ - 616 కోట్లు పెట్టుబడి - 130 ఉద్యోగాలు

4. రెసల్వెన్ టూ ఎనర్జీ - 980 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు

5. గ్రాండ్ తిరుపతి హోటల్స్ & రిసోర్ట్స్ - 188 కోట్లు పెట్టుబడి - 851 ఉద్యోగాలు

ఈ వార్తలూ చదవండి

బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు

ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy