Dailyhunt
ఎర్త్ అవర్..  హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

ఎర్త్ అవర్.. హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు

హైదరాబాద్, మార్చి 28: ఎర్త్ అవర్ 2026లో పాల్గొనాలని నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పిలుపునిచ్చింది. ఈ ఏడాది ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు(శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు.

ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని నగరవాసులకు సూచించారు.

#GiveAnHourForEarth అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పచ్చదనం పెంపు, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలని, వాతావరణ మార్పులకు స్పందించే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, సంస్థలు, విద్యాసంస్థలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. పర్యావరణ హిత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు, పర్యావరణ సంరక్షణకు మనమంతా ఒక్కటిగా కృషి చేద్దామని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

.

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్‌.. మధ్యలో మస్క్ ఎంట్రీ

అమరావతికి చట్టబద్ధత.. నేడు ఏపీ అసెంబ్లీలో చారిత్రక తీర్మానం..

Read Latest Telangana News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy