Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏటీఎమ్‌లో ఫెవిక్విక్ వేస్తారు.. ఇట్టే డబ్బులు దోచేస్తారు.!

ఏటీఎమ్‌లో ఫెవిక్విక్ వేస్తారు.. ఇట్టే డబ్బులు దోచేస్తారు.!

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు తెలివి మీరిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో దొంగతనాలు చేసి, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.

మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన ఓ గ్యాంగ్ కొత్తరకం మోసానికి తెరలేపింది. వివరాల్లోకెళితే...

ఈ గ్యాంగ్‌లోని ఒక సభ్యుడు స్థానికంగా ఉన్న ఏటీఎమ్‌లోకి వెళ్లి డెబిట్/క్రెడిట్ కార్డ్ స్లాట్‌లో ఫెవిక్విక్ పోస్తాడు. దీంతో కస్టమర్లు ఎవరైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్లి కార్డ్ అందులో ఉంచితే.. ఆ కార్డ్ మెషీన్‌లోనే ఇరుక్కుపోతుంది. ఎంత లాగినా అది బయటకు రాదు. అప్పుడే గ్యాంగ్ సభ్యుడొకడు 'ఏమైనా సాయం కావాలా' అంటూ అమాయకంగా పలకరిస్తాడు. కార్డు ఇరుక్కుపోయిందని కంగారులో ఉన్న కస్టమర్ విషయం మొత్తం చెబుతాడు. ఇది పెద్ద సమస్యేమీ కాదన్నటు సమాధానిస్తూ.. ఏటీఎమ్‌లో పిన్ మూడు సార్లు ఎంటర్ చేయమని సూచిస్తాడు. ఆ వ్యక్తి అలాగే చేసినా అది బయటకు రాదు. తరవాత అతడు కస్టమర్ కేర్ నంబర్ ఇస్తానని చెప్పి, తన గ్యాంగ్‌లోని మరో వ్యక్తి నంబర్ ఇస్తాడు. ఆ నంబర్‌కు కాల్ చేయగా బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. కస్టమర్ చెప్పిన ఆ వివరాలతో అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం దోచేస్తాడా కేటుగాడు. ఇలా ఫెవిక్విక్‌తో మాయ చేసి బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా కాజేస్తారు.

అయితే.. ఈ ఘటనపై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఠాణే పోలీసులు ఈ గ్యాంగ్ గుట్టురట్టైంది. విచారణ జరిపి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరంలో ఈ నలుగురే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

pan>

ATM Cash Stuck: ఏటీఎమ్ మెషీన్‌లో డబ్బు ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలంటే..

'షుగర్ డాడీని కూడా చంపేస్తా'.. గువాహటి ఘటన నిందితుడి కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy