Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. 2-0తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో నాకౌట్ దశను దాటింది.

దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మెక్సికో ప్రభుత్వం ధ్రువీకరించింది.

మృతుల్లో 19 ఏళ్ల యువతి, 44 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అభిమానులు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు నెట్టేసుకోవడంతో ఊపిరాడక ఆ ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా మృతిచెందినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ విషయాన్ని అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy