Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..

ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది అల్పాహారం మానేయడం, భోజనాన్ని ఆలస్యం చేయడం లేదా రోజంతా కేవలం టీ, కాఫీ లేదా జ్యూస్‌లపై ఆధారపడడం చేస్తున్నారు.

కానీ ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనం మానేస్తే ఏమవుతుంది?

పగటిపూట తగినంత ఆహారం తీసుకోకపోతే సాయంత్రం సమయంలో ఎక్కువ ఆకలి వేస్తుంది. దీంతో రాత్రిపూట అధికంగా తినడం లేదా జంక్ ఫుడ్ తినే అవకాశం పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఉపవాసం చేయడం లేదా భోజనం మానేయడం ఫిట్‌నెస్‌కు పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి ఏమి చేయాలి?

భోజనం మానేయడం కంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించి వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుతాయి.

క్రాష్ డైట్‌లకు వీడ్కోలు చెప్పండి

త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో చేసే క్రాష్ డైట్‌లు, డిటాక్స్ టీల వంటి పద్ధతులు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే సమతుల్య ఆహారమే నిజమైన ఫిట్‌నెస్‌కు దారి చూపుతుంది. సరైన సమయానికి తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం, మంచిగా నిద్రపోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026.. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy