Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి

విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి

ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం..విండ్ చైమ్ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్మకం ఉంది. కానీ వాటిని కేవలం అలంకరణగా ఉంచడం సరిపోదు.

వాటి రకం, కడ్డీల సంఖ్య, అలాగే ఉంచే దిశ కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఐదు కడ్డీలు ఉన్న గాలి గంటలు ప్రత్యేకంగా శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గించి, శాంతి, సానుకూలతను పెంచుతాయని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు లేదా చెక్కతో చేసిన విండ్ చైమ్‌ను ఇంట్లో తూర్పు, ఆగ్నేయం లేదా దక్షిణ దిశల్లో ఉంచడం శుభప్రదమని చెబుతారు. ఇలా ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని భావిస్తారు.

అయితే విండ్ చైమ్‌ను పడకగది, వంటగది లేదా బాత్‌రూమ్ వంటి ప్రదేశాల దగ్గర అస్సలు పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బదులుగా గాలి బాగా వచ్చే ప్రధాన ద్వారం లేదా కిటికీ దగ్గర ఉంచడం ఉత్తమమని చెబుతున్నారు. కొత్త విండ్ చైమ్‌ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు దానిని గంగాజలంతో లేదా శుభ్రమైన నీటితో క్లీన్ చేసి, శుభప్రదమైన ప్రదేశంలో అమర్చడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026.. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత

రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy