ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలోని గిరోండ్ (Gironde) అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు భారీ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే వేలాది హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతి అయింది.
తీవ్ర వేడి, దీర్ఘకాలిక కరువు పరిస్థితులు, బలమైన గాలులు మంటలను మరింత వేగంగా వ్యాపింపజేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది (France wildfire).
ఈ కార్చిచ్చు ఇప్పటివరకు పారిస్ నగర వైశాల్యానికి నాలుగు రెట్లకు సమానమైన ప్రాంతాన్ని దహనం చేసింది. లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
పొడి గాలుల కారణంగా ఇప్పటికే అదుపులోకి వచ్చిన ప్రాంతాల్లో కూడా మంటలు మళ్లీ చెలరేగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తిరిగి ఇళ్లకు వెళ్లకుండా ఆంక్షలు కొనసాగిస్తున్నారు (Europe heatwave).
ప్రస్తుతం భారీ మంటలు ఫ్రాన్స్‌లోని అణు కేంద్రాలు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ యూనిట్ల వైపు వేగంగా దూసుకొస్తున్నాయి (France forest fire 2026). ఫ్రాన్స్ అణ్వాయుధ వ్యవస్థకు సంబంధించిన ప్రదేశాలతో పాటు, అత్యంత కీలక రక్షణ, ఏరోస్పేస్ సౌకర్యాలున్న ప్రాంతానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో మంటలు ఉన్నాయి. మంటల వల్ల ఈ కీలక కేంద్రాలకు నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఈ కేంద్రాలకు సమీపంలో ఉన్న చెట్లను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు.
trong>
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

