Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

మరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళనాడు సీఎం విజయ్‌తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు (శుక్రవారం) మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. దశాబ్దం కాలం పాటు నలిగిపోయి, ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి సీఎం అవగానే తనతో పోలిక పెట్టారని తెలిపారు. ఊర్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మన ఊర్లో పెళ్లి జరుగుతుంటే. చిన్నపిల్లలు పరుగులు పెడుతుంటారని.. అలా ఉంది వారి ప్రచారమని ఎద్దేవా చేశారు.

పొంతన లేని పోలికలు పెట్టడం మానుకోండి..

ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరని.. అక్కడి పరిస్థితులు వేరని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 2019లో తాను పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారని.. దీంతో తనతో ఉన్న నాయకులు వెళ్లిపోయారని ప్రస్తావించారు. పొంతన లేని పోలికలు పెట్టి.. ప్రచారం చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. కమ్యూనిస్టులు పార్టీ పెట్టి ఎన్నో దెబ్బలు తిని నిలబడ్డారని ప్రస్తావించారు. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే అంత ఈజీ కాదని తెలిపారు.

దెబ్బతినకుండా ఏదీ రాదు..

2007 నుంచి 2018 వరకు దశాబ్దం పాటు తాను ఇబ్బంది పడ్డానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. దెబ్బతినకుండా ఏదీ రాదని.. 2024కి అధికారంలో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఈరోజున అందరూ తనను వదిలేసినా.. తాను పార్టీని ముందుకు తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. కార్యకర్తల నుంచి బలమైన నాయకత్వం తనకు రావాలని కోరుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy