Dailyhunt
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

ఇంటర్నెట్ డెస్క్: నేటి జీవనశైలిలో ఆఫీసు పని, ఇంటి పని లేదా ఆన్‌లైన్ చదువుల కారణంగా చాలా మంది గంటల తరబడి కూర్చోవడం సాధారణమైంది. ఎక్కువసేపు కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ముందు కూర్చోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

నిపుణుల ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల నడుము నొప్పి, రక్త ప్రసరణ సరిగా జరగక చేతులు, కాళ్లలో వాపు కూడా రావచ్చు.

ఇంకా ఈ అలవాటు వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. జీవక్రియ మందగించడం వల్ల కేలరీలు సరిగ్గా ఖర్చు కావు. అలాగే ఎప్పుడూ స్క్రీన్‌ను చూస్తూ ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు సమస్యలు రావచ్చు. ఇది మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపి అలసట, చంచలత్వం, పనిపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు కలిగిస్తుంది.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి:

  • వెన్ను నొప్పి

  • కళ్లు మండటం, అలసట

  • చేతులు, కాళ్లలో వాపు లేదా నొప్పి

  • శక్తి లేకపోవడం, నిద్ర సరిగా రాకపోవడం

  • బరువు పెరగడం, కండరాల బలహీనత

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కనీసం ప్రతి గంటకు ఒకసారి లేచి విరామం తీసుకోవాలి.

  • కొద్దిసేపు నడవాలి లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.

  • కంప్యూటర్‌ను కంటి స్థాయికి సమానంగా ఉండేలా చూసుకుని, సరైన భంగిమలో కూర్చోవాలి.

  • సమతుల్య ఆహారం తీసుకుని, ఎక్కువగా నీరు తాగాలి.

  • యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాాలి.

ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం

పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy