Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ పాము మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అక్కడి పశువైద్యులు ఆపరేషన్ లేకుండానే వాటిని బయటకు తీసి.. ఆ పామును రక్షించారు.

టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో జరిగిందీ ఘటన. కొందరు వ్యక్తులు ఏవియన్ అండ్ ఎగ్సాటిక్ హాస్పిటల్‌కు ఓ పామును తీసుకువచ్చారు. దాని కడుపులో గోల్ఫ్ బంతులు ఇరుక్కుపోయాయని వారు చెప్పారు. పరీక్షించిన వైద్యులు పాముకు మత్తుమందు ఇచ్చారు.

తరువాత దాని శరీరంలో ఇరుక్కుపోయిన బంతులను వైద్యులు చేతులతో నెట్టుకుంటూ వచ్చారు. ఒక్కో బంతి నోటి దగ్గరకు రాగానే పాము నోరు తెరుచుకోవడంతో వైద్యులకు పని సులభమైంది. ఇలా మూడు బంతులనూ వారు బయటకు తీశారు. పాముకు హాని కలగకుండా నెమ్మదిగా ఈ ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. ఇది తమకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పారు. వైద్య వృత్తిలో ఇలాంటి అరుదైన కేసులు ఎదురవుతాయని అన్నారు. కాగా ఈ చికిత్సకు సంబంధించిన వీడియోను ఆసుపత్రి యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడది వైరలవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy