Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌

గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌

న్యూఢిల్లీ, జూన్ 5: అండమాన్, నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిని ఒక వ్యూహాత్మక, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చడం కోసం భారత ప్రభుత్వం 'గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్' చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ ఉత్పాదన కేంద్రం, టౌన్‌షిప్ నిర్మాణం జరగనుంది. 'గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్' కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ప్రాజెక్ట్ కారణంగా అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 'గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్'కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా #GreenOverGreed, #NicobarMatters హ్యాష్‌ట్యాగ్స్‌తో.. దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రాజెక్ట్ కారణంగా నికోబార్‌ దీవుల్లో స్కూబా డైవింగ్‌తో పగడపు దిబ్బలను విధ్వంసం చేస్తున్నారంటూ రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy