Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై..

కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై..

చెన్నై, జూన్ 5: మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు.

భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. అన్నామలై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్పు కోసమే బీజేపీలో చేరానన్నారు. రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.

రాజీనామా గురించి ముందే చెప్పా..

అన్నామలై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. 'తమిళనాడులో బీజేపీ ఒంటిరిగా పోటీ చేయాలని ఆశించా. 18 నెలలుగా బీజేపీతో విభేదాలు ఉన్నాయి. బీజేపీకి నేను భారంగా ఉండాలనుకోవడం లేదు. అందుకే బీజేపీకి రాజీనామా చేశా. 2025 డిసెంబర్ నెలలోనే అధిష్ఠానానికి రాజీనామా గురించి చెప్పా. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీలో ఉన్నా' అని అన్నారు.

కొత్త పార్టీ అవసరమే..

ఆయన మాట్లాడుతూ.. 'ఈ సమయంలో తమిళనాడుకు కొత్త పార్టీ అవసరమా అని అడిగితే.. కచ్చితంగా అవసరమే. ఓ షాపునకు వెళ్లి టూత్‌పేస్టో.. బియ్యమో.. కందిపప్పో కొంటున్నపుడు పది షాపులు తిరుగుతాము. రేటు, నాణ్యత చెక్ చేసి కొంటాం. ఎందుకంటే అవి మన శరీరంలోకి పోయేవి. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా పార్టీ నాయకుడు ఎలాంటి వాడో ప్రజలు చూస్తారు. పక్కంటి వాళ్లను చూసినట్లే ప్రజలు మమ్మల్ని చూడబోతున్నారు. దూరం నుంచి ప్రజలకు అభివాదం చేసే రాజకీయాలకు మేము దూరం. కల్ట్ పాలిటిక్స్ నుంచి బయటకు రావాలి. రాజకీయాలను మారుస్తాం అంటున్నారు.. మళ్లీ అదే కల్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ పాలిటిక్స్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. కేవలం ముఖ్యమంత్రి కారణంగా మార్పు సాధ్యం కాదు. సర్పంచ్ దగ్గరి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ నిబద్ధత కలిగిన వాళ్లు ఉంటేనే మార్పు సాధ్యం అవుతుంది' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy