Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుడ్లతో ఈ ఆహారాలు తింటే సమస్యలే!

గుడ్లతో ఈ ఆహారాలు తింటే సమస్యలే!

ఇంటర్నెట్ డెస్క్: గుడ్లు పోషకాలతో నిండిన ఆహారం. వీటిలో ప్రొటీన్, విటమిన్ D, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కండరాల బలానికి, మెదడు పనితీరుకు, కంటి ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి.

అయితే గుడ్లతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సోయా పాలతో గుడ్లు

సోయా పాలు, గుడ్లు రెండింటిలోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఒకేసారి అధికంగా తీసుకుంటే శరీరం ప్రొటీన్‌ను పూర్తిగా గ్రహించడంలో ఇబ్బంది పడవచ్చు. అందుకే వీటిని వేర్వేరు సమయాల్లో తీసుకోవడం మంచిది.

టీ తాగొద్దు

చాలామంది అల్పాహారంలో గుడ్లు తింటూ టీ తాగుతుంటారు. అయితే టీలో ఉండే కొన్ని పదార్థాలు గుడ్లలోని ప్రొటీన్ శోషణను తగ్గించవచ్చు. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్లు తిన్న తర్వాత కనీసం 30 నుంచి 60 నిమిషాల గ్యాప్‌తో టీ తాగడం మంచిది.

అధిక చక్కెర పదార్థాలు

గుడ్లతో పాటు ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు లేదా పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

అరటిపండ్లు, గుడ్లు

గుడ్లు, అరటిపండ్లు ఒకేసారి తినడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే వీటిని వేర్వేరు సమయాల్లో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మాంసాహారం

గుడ్లు, మాంసం రెండూ ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు. వీటిని ఒకేసారి ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై భారం పడవచ్చు. దీంతో అలసట, అసౌకర్యం వంటి సమస్యలు కలగొచ్చు. గుడ్లను కూరగాయలు, ధాన్యాలు లేదా పండ్లతో కలిపి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

చికెన్‌ రెసిపీలకు వెల్లుల్లి పేస్ట్ మంచిదా.. తరిగిన వెల్లుల్లి మంచిదా?

భర్త బయటకు వెళ్లాక ఈ పనులు చేయకూడదట!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy