Dailyhunt
హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్న బంగారం ధర నిన్న (గురువారం) వినియోగదారులకు ఊరటనిస్తూ రూ.870 మేర తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,010గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,590గా ఉంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం నగరంలో కిలో వెండి రూ.2,94,900గా ఉంది (Gold, Silver Rates on Feb 27).

అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ప్రభుత్వ విధానాల్లో అస్పష్టత కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఈ వారం ఇప్పటివరకూ 24 క్యారెట్ బంగారం ధర రూ.1,730ల మేర పెరగ్గా 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,600ల మేర పెరిగింది. వెండి రేటు సుమారు రూ.5 వేల పెరిగింది. ఈ వారమంతా ధరలు ఇలా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు

  • చెన్నై: ₹1,62,760; ₹1,49,190

  • ముంబై: ₹1,61,010; ₹1,47,590

  • ఢిల్లీ: ₹1,61,820; ₹1,48,340

  • కోల్‌కతా: ₹1,61,010; ₹1,47,590

  • బెంగళూరు: ₹1,61,010; ₹1,47,590

  • హైదరాబాద్: ₹1,61,010; ₹1,47,590

  • విజయవాడ: ₹1,61,010; ₹1,47,590

  • కేరళ: ₹1,61,010; ₹1,47,590

  • పుణె: ₹1,61,010; ₹1,47,590

  • వడోదరా: ₹1,61,720; ₹1,48,240

  • అహ్మదాబాద్: ₹1,61,720; ₹1,48,240

వెండి (కిలో) ధరలు ఇవీ

  • చెన్నై: ₹2,94,900

  • ముంబై: ₹2,84,900

  • ఢిల్లీ: ₹2,84,900

  • కోల్‌కతా: ₹2,84,900

  • బెంగళూరు: ₹2,84,900

  • హైదరాబాద్: ₹2,94,900

  • విజయవాడ: ₹2,94,900

  • కేరళ: ₹2,94,900

  • పుణె: ₹2,84,900

  • వడోదరా: ₹2,84,900

  • అహ్మదాబాద్: ₹2,84,900

గమనిక:ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

ఈ వార్తలూ చదవండి:

ఎంఎఫ్‌ రంగంలో సెబీ భారీ సంస్కరణలు

స్టాక్ మార్కెట్స్.. ఉదయం లాభాలు, మధ్యాహ్నం నష్టాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy