ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని హవాయి రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కౌవాయి (Kauai) దీవిలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక ప్రాంతమైన 'కలలౌ బీచ్' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
హవాయి రాష్ట్రంలో అందమైన పర్యాటక కేంద్రమైన కలలౌ(Kalalau) బీచ్ సమీపంలో ఒక హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 'ఎయిర్ బోర్న్ ఏవియేషన్' సంస్థకు చెందినది అధికారులు తెలిపారు. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితులా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

