Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..

హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..

ఇంటర్నెట్ డెస్క్: చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ భద్రత కోసం అమెరికా చేస్తున్న ఖర్చులను, లబ్ది పొందుతున్న దేశాలు తిరిగి చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.

ఎవరి నుంచి ఎలాంటి సహాయమూ తీసుకోకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు అమెరికా భద్రత కల్పిస్తోందని ఆయన అన్నారు (Donald Trump Strait of Hormuz).

'హోర్ముజ్ జలసంధి భద్రత కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల పలు దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఆయా దేశాలు అమెరికాకు పరిహారం చెల్లించాలి. ప్రపంచ దేశాలు అమెరికాకు ఎలాంటి సహాయమూ చేయడం లేదు. ఇతర దేశాల కోసం అమెరికా తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. తరతరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది' అని ట్రంప్ పేర్కొన్నారు (Trump reimbursement demand).

మరోవైపు ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉందని కూడా ట్రంప్ సంకేతాలు ఇచ్చారు (US Iran War). టెహ్రాన్ త్వరగా ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని, అమెరికా కూడా చర్చలకు సిద్ధంగానే ఉందని ఆయన అన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం తమదేనని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్

గురుగ్రామ్‌లో దారుణం.. వెంటపడొద్దన్నందుకు మహిళా బైకర్‌ను..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy