Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇలాంటివి భారతీయులకే సాధ్యం.. దోమల నుంచి రక్షణకు సూపర్ ట్రిక్..

ఇలాంటివి భారతీయులకే సాధ్యం.. దోమల నుంచి రక్షణకు సూపర్ ట్రిక్..

భారతీయుల సృజనాత్మకతకు, జుగాడ్ ఆలోచనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. క్లిష్టమైన సమస్యలకు తక్కువ ఖర్చుతో వినూత్న పరిష్కారాలు కనుగొనే భారతీయుల ప్రతిభను చూపించే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'ఇలాంటి ఆలోచన భారతీయులకే వస్తుంది' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు (Mosquito net hack).

@vstechsolution అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సాధారణ దోమతెరను వినూత్నంగా అమర్చి, తాను నిద్రించే ప్రదేశాన్ని దోమల నుంచి పూర్తి సురక్షితంగా మార్చుకున్నాడు. మంచాన్ని నేలపై రివర్స్‌లో పరిచి నాలుగు వైపులా దోమతెరను పూర్తిగా అమర్చాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు. దోమల తెరను అమర్చే ఈ విలక్షణమైన పద్ధతి ఇప్పుడు వైరల్ అవుతోంది (Desi creative invention).

వేల మంది ఈ వీడియోను వీక్షించి ఈ ట్రిక్‌ను ప్రశంసించారు (Indian jugaad Video). 'ఇది నిజంగా గొప్ప ఆలోచన', 'దోమల సమస్య ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇది ఉపయోగపడుతుంది', 'భారతీయుల సృజనాత్మకతకు ఇది మరో నిదర్శనం' అని చాలా మంది కామెంట్లు చేశారు.


అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy