Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అకస్మాత్తుగా ఏర్పడ్డ ఇరాన్- అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం సంక్షోభం పరిస్థితులను సృష్టించింది. దీంతో గల్ఫ్ దేశాలలో 10, 12వ తరగతి పరిక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేయడంతో అయోమయ స్థితి నెలకొంది.

12వ తరగతి పరీక్షల్లో కొన్నింటిని రద్దు చేసి దానికి బదులుగా ఒక అంచనా ప్రకారం మార్కులు వేయడంతో గల్ఫ్ దేశాలలోని వేలాది మంది ప్రవాస భారతీయ విద్యార్థులు గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో చేరే అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని గల్ఫ్ ప్రవాసీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

​సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, కువైత్, బహ్రెయిన్, ఒమాన్ దేశాలలో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు మార్చిలో 12వ తరగతి పరిక్షలు వ్రాస్తుండగా కొన్ని పరీక్షలను సీబీయస్ఈ అధికారులు రద్దు చేశారు. దీనికి బదులుగా అంతర్గత అంచనాల ప్రకారం మార్కులు కేటాయించడంతో తక్కువ మార్కులు వచ్చి విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులకు ప్రవేశార్హత కోల్పుతున్నారని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణా, నాయకులు జానీ బాషా, చెన్నుపాటి రాజశేఖర్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు వారు శుక్రవారం ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను లేఖ ద్వారా తీసుకెళ్లారు. సత్వరమే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి అందులో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇది కుదరని పక్షంలో గ్రేస్ మార్కులు ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలో సీబీయస్ఈ అధికారుల అనాలోచిత నిర్ణయంతో తమకు కలిగిన అన్యాయంపై విద్యార్థులు న్యూఢిల్లీలో అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని అన్నారు. మరోవైపు స్వదేశంలో డిగ్రీ కోర్సులకు ప్రవేశాల ప్రక్రియ వేగవంతమవుతుందని వారు పెర్కోన్నారు.

​గల్ఫ్‌లోని భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున వారి శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాధాకృష్ణ, నాయకులు జానీ బాషా, చెన్నుపాటి రాజశేఖర్‌లు విజ్ఞప్తి చేసారు.

​గల్ఫ్ దేశాలలో 198 సీబీయస్ఈ పాఠశాలలు న్యూఢిల్లీలోని సీబీఎస్‌ఈకి అనుబంధంగా భారతీయ విద్యాభోధన చేస్తుండగా అందులో సుమారు లక్షా 80 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలుగుదేశం నాయకులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

మధుర ప్రవాసంలో కఠోర బాల్యం.. స్నేహితులు కరవై ఒంటరితనం

అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy