హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి (Telangana Minister Vivek Venkataswamy) ఈరోజు (శనివారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లారీల కదలికలపై 24x7 పర్యవేక్షించాలని హుకుం జారీ చేశారు. ఇసుక నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని దిశానిర్దేశం చేశారు.
అలాగే, సాండ్ బజార్ల పనితీరుపై మంత్రి వివేక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కీలక ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖనిజ వనరుల సమర్థ నిర్వహణకు అమలు చేసే వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు. అక్రమ మైనింగ్ నియంత్రణ చర్యలను మంత్రికి.. టీజీఎండీసీ అధికారులు వివరించారు. రాష్ట్ర ఖనిజ రంగంలో ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
.
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News

