Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

  • 'జల్‌సంచయ్‌' సదస్సులో మంత్రి ఉత్తమ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన జల్‌ సంచయ్‌.. జన్‌ భాగీదారీ సదస్సులో ఆయన ప్రసంగించారు. నీటి సంరక్షణను కేవలం ఇంజినీరింగ్‌ కార్యక్రమంగా కాకుండా, ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాఽధి, పర్యావరణ పరిరక్షణకు జలభద్రతే అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో సదుపాయం, ప్రతి గ్రామానికీ విశ్వసనీయమైన సామూహిక జలవనరు ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాలతోపాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) నిధుల ద్వారా జలసంరక్షణ పనులు జరుగుతున్నాయని.. వీటి మధ్య సరైన సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు పొందలేమన్నారు. ప్రతి జలసంరక్షణ ఆస్తిని (చెక్‌డ్యామ్‌లు, చెరువులు తదితర) జియో ట్యాగింగ్‌ చేసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని ప్రతిపాదించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కల్యాణ లక్ష్మి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy