Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత

జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత

ప్రకాశం, జూన్6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కో చేసిన దాష్టీకాలను అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. జగన్ హయాంలో దళితులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసుని చెప్పుకొచ్చారు. తనపై, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఈరోజుకు కూడా అట్రాసిటీ కేసుల గురించి కడప కోర్టుకు తిరుగుతున్నామని తెలిపారు.

ఈరోజు (శనివారం) ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. అంబేడ్కర్ భావజాలం అందరికీ నరనరాల్లో లేకపోతే ఆయన చేసిన సేవ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని చెప్పుకొచ్చారు. కొంతమంది దళితుల మధ్యలోనే ఉండి విభేదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. రామ్ విలాస్ పాశ్వాన్ ఒక దళిత నాయకుడని చెప్పుకొచ్చారు. ఒక పార్టీని స్థాపించడమే కాకుండా ఆరుగురు ప్రధానుల దగ్గర మంత్రిగా పని చేశారని ప్రస్తావించారు.

దళిత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ చిన్న వయసులోనే కేంద్రమంత్రి పదవి చేపట్టారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర హనుమంతుడినని చిరాగ్ పాశ్వాన్ చెప్పారని ప్రస్తావించారు. అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ చూసినా ఊరి చివరన ఉంటుందని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కనిగిరి పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కనిగిరిలో అంబేడ్కర్ విగ్రహాన్ని అన్నివర్గాలు కలిసి ఏర్పాటు చేశాయని చెప్పారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అందరూ రెడ్‌బుక్ గురించే మాట్లాడుతున్నారని.. కానీ లోకేశ్ పాదయాత్రలో పట్టుకున్న రాజ్యాంగం కనిపించలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం పట్టుకునే లోకేశ్ పాదయాత్ర చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

.

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy