Dailyhunt
జగన్‌ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల

జగన్‌ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల

రాజమండ్రి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) సంచలన వ్యాఖ్యలు చేశారు.

హత్య రాజకీయాలకు జగన్ అలవాటు పడ్డారని విమర్శలు చేశారు. జగన్‌తో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN Andhrajyothy MD Vemuri Radhakrishna) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీస్తుకొస్తున్న రాధాకృష్ణకు జగన్ నుంచి ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాధాకృష్ణపై దాడి చేయించే ప్రమాదం ఉందని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

తండ్రిని అడ్డుపెట్టుకొని పరిటాల రవిని హత్య చేయించారు..

ఈరోజు(ఆదివారం) రాజమండ్రిలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రిని అడ్డుపెట్టుకొని పరిటాల రవిని హత్య చేయించిన చరిత్ర జగన్‌దని ఎద్దేవా చేశారు. పరిటాల రవి చుట్టూ ఉన్న అనేక మందిని హత్యలు చేయించారని ఆరోపించారు. జగన్ తన తాత రాజారెడ్డి నుంచి హత్యా రాజకీయాలను వారసత్వంగా వుణికిపుచ్చుకున్నారని సెటైర్లు గుప్పించారు. అధికారం కోసం జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డినే హత్య చేయించి కేసులు మాఫీ చేయించుకునేందుకు కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు.

చంద్రబాబును జైల్లో పెట్టించిన దుర్మార్గుడు జగన్..

జగన్ చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబును జైల్లో పెట్టించిన దుర్మార్గుడు జగన్ అని ఆగ్రహించారు. ఆస్తికోసం చెల్లిని, తల్లిని దూరం పెట్టారని దుయ్యబట్టారు. ఆయన లాంటి రాక్షసుడు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు దేశమే నాశనం అవుతుందని విమర్శించారు. జగన్‌ పొరపాటున కూడా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ప్రజలు రానివ్వరని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

.

జగన్ హయాంలో పేదలకు అన్నం లేకుండా చేశారు.. సీఎం ధ్వజం

స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy