Dailyhunt
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

మరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. తన ధనదాహం, అధికారదాహానికి ఎవరు అడ్డొచ్చినా తల్లైనా, చెల్లైనా, బాబాయ్ అయినా ఎవరైనా ఒకటేనని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. జగన్ క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని.. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలని అన్నారు.

పెద్ద దస్తగిరి హత్య, బాబాయ్ హత్య, జగన్ కారు చక్రాల కింద నలిగిన కార్యకర్త ఇలా ఎన్నో ఉదాహరణలు జగన్ నైజాన్ని బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. జగన్ సన్నిహితుడు నిత్యానంద రెడ్డి సొంత పార్టీకి చెందిన దస్తగిరిని హత్య చేయటం జగన్ స్వార్ధాన్ని తెలుపుతోందన్నారు. తాడేపల్లిలో తనకున్న అనుబంధంలో భాగంగానే దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. హింసా రాజకీయాలు నడిపే వారికి రాష్ట్రంలో చోటు లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. వైసీపీకి ఏపీలో చోటు లేకుండా చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.

.

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

జగన్‌ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy