Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

స్పోర్ట్స్ డెస్క్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు పట్టు సాధించింది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మరోసారి అద్భుత సెంచరీతో మెరిశాడు.

దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఇదే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్, లంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య వివాదం జరిగింది. దీనిపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు.

తొలి రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత సితాన్షు మీడియాతో మాట్లాడాడు. ఈ ఘటన ఆవేశంలో జరిగి ఉండొచ్చునని భావిస్తున్నప్పటికీ, జైస్వాల్ ప్రత్యర్థి ఆటగాడిని భౌతికంగా తాకకుండా ఉండాల్సిందని ఆయన స్పష్టం చేశాడు. లంక ఆటగాళ్లు ఏదో కామెంట్స్ చేసి ఉంటారని, ఆవేశంలో అలా జరిగి ఉండొచ్చని సితాన్షు తెలిపాడు. అయితే జైస్వాల్, ఫెర్నాండోకు అంత దగ్గరగా వెళ్లి ఉండకూడదని, దగ్గరకు వెళ్లడం వల్లే.. పొరపాటున హెల్మెట్ తాకిందని వెల్లడించాడు. ఇదంతా ఆవేశంలో జరిగి ఉండొచ్చని, ఉద్దేశపూర్వకంగా అయితే కాదని కోటక్ స్పష్టం చేశాడు.

అసలేం జరిగిందంటే..

రెండో టెస్టు తొలి రోజు ఆటలో ధాటిగా ఆడుతున్న భారత ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ను 17వ ఓవర్‌లో పేసర్‌ అసిత ఫెర్నాండో బౌల్డ్‌ చేశాడు. దీంతో జైస్వాల్‌ నిరాశగా క్రీజును వీడుతున్న సమయంలో అసిత కవ్వించాడు. వెంటనే కోపంతో వెనక్కి వచ్చిన జైస్వాల్‌ నేరుగా అసిత మీదికి వెళ్లాడు. అంతేకాకుండా తన హెల్మెట్‌ ముందుభాగాన్ని అసిత నుదిటికి ఆనించి నెట్టడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే లంక కెప్టెన్‌ ధనంజయ వెంటనే స్పందించి జైస్వాల్‌ను పక్కకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.

strong>

దేవ్‌దత్‌ ధమాకా

జైస్వాల్‌, ఫెర్నాండో.. బాహాబాహీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy