Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!

జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవలే టీమిండియా క్రికెటర్ అజింక్య రాహానే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌తో పాటు ముంబై క్రికెట్‌కు చిరకాలం సేవలందించి, మంచి ప్లేయర్‌గా రహానే పేరు సంపాదించాడు.

టీమిండియా తరఫున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే, ముంబై జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంతో గర్వకారణమైన విజయాలను అందించాడు. ఆయన కెప్టెన్సీ కెరీర్‌లో పలు ముఖ్యమైన ఘటనలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి.. 2022లో వెస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

ఆ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను క్రమశిక్షణా రాహిత్యం కారణంగా మైదానం నుంచి పంపేయడం అప్పట్లో పెను సంచలనమైంది. సౌత్ జోన్ బ్యాటర్ రవి తేజతో జైస్వాల్ పదే పదే స్లెడ్జింగ్‌కు పాల్పడటంతో వివాదం ముదిరింది. అంపైర్లు జోక్యం చేసుకుని రహానేకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో, పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన రహానే వెంటనే రంగంలోకి దిగాడు. జైస్వాల్‌ను వారించినప్పటికీ అతను వెనక్కి తగ్గకపోవడంతో, కెప్టెన్‌గా కఠిన నిర్ణయం తీసుకుని అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లమంటూ ఆదేశించాడు.

ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో రహానే ఈ సంఘటనపై స్పందించాడు. 'ఆ సమయంలో మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆటగాళ్లు నియంత్రణ కోల్పోతున్నారని గ్రహించాను. జైస్వాల్‌కు అప్పుడు బాధ కలిగి ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో అతడికి జరగబోయే నష్టా్న్ని ఊహించి నా బాధ్యతగా ఆ నిర్ణయం తీసుకున్నాను' అని తెలిపాడు. ఒకవేళ తాను ఆ చర్య తీసుకోకపోతే మ్యాచ్ రిఫరీ జైస్వాల్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించేవారని, ఆ మేరకు సిద్ధం చేసిన లేఖను తన ముందే చింపివేశారు వెల్లడించారు. ఆనాడు రహానే తీసుకున్న ఆ చొరవ వల్లే జైస్వాల్ కెరీర్ ప్రమాదం నుంచి బయటపడి, నేడు టీమిండియాలో అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అజింక్య రహానే టీమిండియా క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

strong>

అతడు ఒక అద్భుతం.. వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు

జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy