అమరావతి, జూన్ 6: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. రమేశ్ నామినేషన్‌ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు.
రమేష్ నామినేషన్‌పై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. లింగమనేని వెంట మద్దతుగా కూటమి ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎన్ ఈశ్వర రావు (బీజేపీ) వెళ్లారు.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు: రమేశ్
జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసినట్లు రమేశ్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింగమనేని రమేశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలెక్ట్ అయ్యాక అందరితో మరోసారి మాట్లాడుతానని రమేశ్ వెల్లడించారు.
రమేశ్ స్వగ్రామంలో సంబరాలు
లింగమనేని రమేశ్ రాజ్యసభకు ఎంపికవడంపై స్వగ్రామం మొవ్వ మండలం పెద్ద ముత్తెవిలో సంబరాలు అంబరాన్నంటాయి. రమేశ్.. గ్రామస్థాయి నుంచి రాజ్యసభ వరకు ఎదిగారని గ్రామస్థులు తెలిపారు. పెదముత్తేవి శ్రీలక్ష్మీపతి స్వామి ఆలయంలో రమేశ్ విజయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టుదలతో చిన్న వ్యాపారాల నుంచి రమేశ్ ఎదిగారని హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు అన్నారు. రమేశ్‌కు ఇంకా ఉన్నత పదవులు రావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
యువకుడిని కారుతో ఢీకొట్టిన మహిళ.. ఆపై తన భర్త పోలీస్ అంటూ బెదిరింపులు..
సడన్‌గా నిలిచిన ఇండిగో విమానం.. ఫ్లైట్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ
Read Latest AP News And Telugu News

