Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువకుడిని కారుతో ఢీకొట్టిన మహిళ.. ఆపై తన భర్త పోలీస్ అంటూ బెదిరింపులు..

యువకుడిని కారుతో ఢీకొట్టిన మహిళ.. ఆపై తన భర్త పోలీస్ అంటూ బెదిరింపులు..

ర్యానా: మహిళా డ్రైవర్, ఓ యువకుడికి మధ్య జరిగిన వాడివేడి సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టడమే కాకుండా అడ్డగోలు వాదనకు దిగిన మహిళపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

పైగా, తన భర్త పోలీసు అధికారి అంటూ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గురుగ్రామ్‌లోని సెక్టార్ 62లో బాధిత యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే మార్గంలో ఓ మహిళ తన కారులో వస్తోంది. అయితే, రోడ్డు పక్కన వెళ్తున్న యువకుడి కాలు పైనుంచి మహిళ కారు వెళ్లింది. దీంతో అతను తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. అనంతరం తేరుకుని మహిళను గట్టిగా నిలదీశాడు. రోడ్డు అంతా ఖాళీగా ఉండగా తనను ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించాడు. అయితే, క్షమాపణలు చెప్పడానికి బదులుగా మహిళ మాటల దాడికి దిగడంతో యువకుడు వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. 'నువ్వు రోడ్డు మధ్యలో నడుస్తున్నావు కాబట్టే నీకు దెబ్బ తగిలింది' అని ఆమె చెప్పడంతో అతను షాక్ అయ్యాడు.

తాను రోడ్డు పక్కనే నడుస్తున్నానని, తప్పు చేసి అడ్డగోలుగా వాదించడం ఆపాలని యువకుడు తేల్చి చెప్పాడు. దీంతో, తన భర్త పోలీసు అధికారి అంటూ సదరు మహిళ బెదిరింపులకు దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత యువకుడు నెట్టింట షేర్ చేశాడు. తప్పు చేసి, ఆపై అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై నెటిజన్లు సీరియస్ అయ్యారు. 'ఇది అహంకారానికి పరాకాష్ట' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఆమె భర్త పోలీసు శాఖలో ఉంటే నేరాలు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనా?' అని మరొకరు.. 'అధికారం ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు పలుకుబడిని ప్రదర్శించడం ఎప్పుడు ఆపుతారు?' అంటూ ఇంకొక నెటిజన్ ప్రశ్నించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy