Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జట్టు నుంచి పిలుపు రాకపోయినా ప్రయత్నాలు ఆపొద్దు.. షమీకి జహీర్ ఖాన్ సూచన

జట్టు నుంచి పిలుపు రాకపోయినా ప్రయత్నాలు ఆపొద్దు.. షమీకి జహీర్ ఖాన్ సూచన

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆలోచనల్లో షమీకి చోటు కనిపించడం లేదని..

అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను ఆపొద్దని సూచించాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. మరోవైపు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్రత్యామ్నాయాలపై సెలెక్టర్లు దృష్టి సారించారు. అయినప్పటికీ షమీ పేరు మాత్రం ఎంపిక సమావేశాల్లో పెద్దగా చర్చకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

'షమీ మ్యాచ్‌లు ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తే జాతీయ జట్టు నుంచి ఎప్పుడైనా పిలుపు అందే అవకాశం ఉంటుంది. జట్టులో ఎంపిక చేయాలా? వద్దా? అనేది పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయం. అయితే ఒక ప్లేయర్‌గా తన చేతుల్లో ఉన్న పనిని పూర్తి చేయాలి. మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనేది మీ నిర్ణయం. మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తే జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటారు. జట్టు ఆలోచన ఒకలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మీ ఆలోచన కూడా ముఖ్యమే. జట్టుకు సేవ చేయాలనుకుంటే మీరు ఆ దిశగా ప్రయత్నించాలి. షమీ ప్రస్తుతం అదే చేస్తున్నాడు. అతడు మ్యాచ్‌లు ఆడుతున్నాడు. వికెట్లు పడగొడుతున్నాడు. అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అతడికి అది చాలా ముఖ్యం' అని జహీర్ ఖాన్‌ పేర్కొన్నాడు.

గాయాలపైన జహీర్ స్పందనిదే..

భారత జట్టులో వరుసగా చోటు చేసుకుంటున్న గాయాలపైనా జహీర్ ఖాన్ స్పందించాడు. బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తదితర ప్లేయర్లు ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించాడు. 'గాయాలు ప్రతి ఆటగాడి ప్రయాణంలో భాగమే. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే గాయాలు సంభవించే సమయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా పేసర్‌ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటున్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు వెళ్లడం కష్టం' అని జహీర్‌ ఖాన్‌ తెలిపాడు.

strong>

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy