Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్  బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్

జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్

స్పోర్ట్స్ డెస్క్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకే ఆలౌట్ కావడంతో, కివీస్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం లభించింది. ఇదిఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 114వ ఓవర్‌ను షోయబ్ బషీర్ వేశాడు. ఈ క్రమంలో రిటర్న్ క్యాచ్ అందుకొన్న బషీర్ న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్ స్మిత్‌ను ఔట్ చేశాడు. దీంతో సహచరులంతా బషీర్‌ను అభినందించేందుకు అతడి వద్దకు వచ్చారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జోఫ్రా ఆర్చర్ మాత్రం రాలేదు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గట్టిగా అరుస్తూ ఆర్చర్‌ను పిలుస్తాడు. ఆ తర్వాత ఆర్చర్ వచ్చి బషీర్‌ను అభినందించడం వీడియోలో కనిపిస్తుంది.

అయితే, అంతకుముందు ఆర్చర్ ఓవర్‌లో టామ్ బ్లండెల్ ఇచ్చిన క్యాచ్‌ను బషీర్ జారవిడిచాడు. దీంతో బషీర్ వికెట్ తీసినా అభినందించేందుకు రాలేదని నెటిజన్లు అభిప్రాయ డుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఈ మ్యాచ్‌ ద్వారా బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఆల్‌రౌండ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 7,000 కంటే ఎక్కువ పరుగులు, అలాగే 250 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా స్టోక్స్ నిలిచాడు. ఇంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు స్టోక్స్ ఆ ఎలైట్ క్లబ్‌లో చేరాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy