Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జొర్డాన్‌పై అర్జెంటీనా ఘనవిజయం.. మెస్సి సరికొత్త ప్రపంచ రికార్డు!

జొర్డాన్‌పై అర్జెంటీనా ఘనవిజయం.. మెస్సి సరికొత్త ప్రపంచ రికార్డు!

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ జోరును కొనసాగిస్తూ గ్రూప్-జెలో అగ్రస్థానంతో నాకౌట్‌కు దూసుకెళ్లింది.

శనివారం టెక్సాస్‌లో జరిగిన ఉత్కంఠభరిత లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో జోర్డాన్‌ను చిత్తు చేసింది. ఇప్పటికే నాకౌట్ బెర్తు ఖరారు కావడంతో స్టార్ ఆటగాడు, 39 ఏళ్ల లియోనెల్ మెస్సి ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో మెస్సి సరికొత్త రికార్డు సృష్టించాడు.

మ్యాచ్ ప్రారంభమైన గంట తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా మెస్సి మైదానంలోకి అడుగుపెట్టాడు. 80వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను అద్భుతమైన గోల్‌గా మలిచి జట్టుకు మూడో పాయింట్ అందించాడు. దీంతో మెస్సి ఈ టోర్నీలో తన గోల్స్ సంఖ్యను ఆరుకు పెంచుకుని టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాక ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లలో అతడి మొత్తం గోల్స్ సంఖ్య 19కి చేరింది.

అర్జెంటీనా తరఫున అంతకుముందే మొదటి హాఫ్‌లో జియోవాని లో సెల్సో (19వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ పెనాల్టీ ద్వారా గోల్స్ చేసి జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. జొర్డాన్ ఆటగాడు మూసా అల్-తమారి 55వ నిమిషంలో ఒక గోల్ చేసినప్పటికీ, అది ఓటమి అంతరాన్ని తగ్గించలేకపోయింది. అల్జీరియా, ఆస్ట్రియా, జొర్డాన్‌లపై వరుస విజయాలతో 9 పాయింట్లు సాధించిన అర్జెంటీనా.. జూలై 3న మయామిలో జరిగే నాకౌట్ పోరులో అరంగేట్రం జట్టు కాబో వెర్డెతో తలపడనుంది. 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించడమే లక్ష్యంగా అర్జెంటీనా అడుగులు వేస్తోంది.

ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్.. చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!

అమెరికాలో మెరిసిన స్టార్స్: ఫుట్‌బాల్ మాంత్రికుడిని కలిసిన గిల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy