Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్.. చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!

ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్.. చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో రెండుసార్లు ఛాంపియన్ నిలిచిన ఉరుగ్వేకు ఈ సారి బిగ్ షాక్ తలింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-హెచ్‌లో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 0-1 తేడాతో ఓడిపోయిన ఉరుగ్వే..

టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఉరుగ్వే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అలానే కాబో వెర్డె, సౌదీ అరేబియాలతో ఆడిన మ్యాచ్‌లను డ్రా చేసుకుని గ్రూప్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉరుగ్వే ఫుట్‌బాల్ ఫెడరేషన్, ఆటగాళ్లకు గట్టి షాక్ ఇచ్చింది.

ఉరుగ్వే ఆటగాళ్లు తిరిగి స్వదేశం రావడానికి ముందుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక 'చార్టర్డ్ విమానాన్ని' రద్దు చేసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆటగాళ్లంతా కలిసి కాకుండా, సాధారణ విమానాల్లో విడివిడిగా ఇంటికి చేరుకోవాలని బోర్డు ఆదేశించింది. మరోవైపు జట్టు పేలవ ప్రదర్శన, వ్యూహాలపై మ్యాచ్‌కు ముందే ఆటగాళ్లకు, కోచ్ మార్సెలో బియెల్సాకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు సమాచారం. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోచ్ బియెల్సా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

'మూడేళ్లుగా ఈ జట్టుతో పని చేస్తున్నా.. ఫలితాలు రానప్పుడు కోచ్‌గా నేనేం ఇచ్చినా వృథానే. ఉరుగ్వే ఫుట్‌బాల్‌కు నేనేమీ మిగల్చలేదు. క్వాలిఫైయర్స్‌లో 4వ స్థానం, కోపా అమెరికాలో 3వ స్థానం సాధించినా ఈ ఘోర పరాజయం ముందు అవి దేనికీ పనికిరావు. నా పదవీకాలాన్ని ఎవరూ గుర్తుంచుకోరు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బియెల్సా కెరీర్‌లో ఒక జట్టు ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్ దాటకపోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2002లో ఆయన కోచ్‌గా ఉన్న సమయంలో అర్జెంటీనా కూడా ఇదే విధంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో మెరిసిన స్టార్స్: ఫుట్‌బాల్ మాంత్రికుడిని కలిసిన గిల్

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy