Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

మెరికా, మే 9: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన 'తానా స్కాలర్‌షిప్ వెబినార్' కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ వెబినార్‌లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్‌షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షులు డా.నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకటరావు అడుసుమల్లి సహకారం అందించారు.

ఉన్నత విద్య అవకాశాలపై ఆసక్తితో విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. కళాశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు పొందే విధానాలు, విద్యార్థుల ప్రొఫైల్‌ను ఎలా బలపరచుకోవాలనే అంశాలపై విలువైన సూచనలు అందించారు. వెబినార్‌కు హాజరైన వారికి అమెరికాలో కాలేజీ దరఖాస్తులకు ఉపయోగపడే స్కాలర్‌షిప్ గైడ్‌ను తానా నాయకులు అందజేశారు.

తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. 'భవిష్యత్తు విజయాలకు విద్య బలమైన పునాది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తదుపరి తరాన్ని నడిపించడం, ఉత్తేజపరచడం, సాధికారత కల్పించడానికి తానా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది' అని స్పష్టం చేశారు. తమ నైపుణ్యంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారి విద్యా లక్ష్యాల వైపు ప్రేరేపించిన కాలేజీ కౌన్సెలర్, అకడమిక్ కోచ్ జో కేతార్‌కు తానా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy