Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్‌కు కాంస్యం

కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్‌కు కాంస్యం

ఇంటర్నెట్ డెస్క్: భారత జావెలిన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పురుషుల జావెలిన్ త్రోలో భారత్ ఒకేసారి రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా తన రెండో ప్రయత్నంలో సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అయితే శ్రీలంక స్టార్ రమేశ్ పతిరగె 89.75 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 92.62 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన అతడు, ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన 24 ఏళ్ల యశ్వీర్ సింగ్ చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే అతడి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. చివరి రౌండ్‌కు ముందు ఏడో స్థానంలో ఉన్న యశ్వీర్ ఒక్క త్రోతో మూడో స్థానానికి ఎగబాకి కాంస్యాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ రోహిత్ యాదవ్ 81.56 మీటర్లతో ఏడో స్థానంలో నిలిచాడు.

strong>

2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy