Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా: సీఎం రేవంత్‌రెడ్డి

కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే1 (ఆంధ్రజ్యోతి): మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు.

కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా అని అభివర్ణించారు. కార్మికులే నూతన చరిత్ర రచయితలు అని పేర్కొన్నారు. శ్రమజీవుల కన్నీళ్లే అభివృద్ధి చరిత్రకు ఆధారమని తెలిపారు. కార్మికుల త్యాగమే సమాజ ప్రగతికి పునాది అని చెప్పుకొచ్చారు. శ్రమజీవుల శ్రమే నాగరికత నిర్మాణానికి మూలమని, కార్మికుల జీవితమే అభివృద్ధి చరిత్రకు సాక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.

బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

పవిత్రమైన 'బుద్ధ పూర్ణిమ' సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, దయ, సహనం, శాంతి మార్గాలను బుద్ధ భగవానుడు మానవాళికి అందించిన అమూల్యమైన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శనం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పవిత్రమైన రోజున మనమందరం సమైక్య జీవనం, శాంతి మార్గం ఎంచుకుని ముందుకు నడవాలని సీఎం ఆకాంక్షించారు.

.

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy