హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలు కేవలం సరఫరాదారుల లాభం కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పష్టం చేశారు.
వస్తువుల కొనుగోలులో అక్రమాలను నివారించేందుకు అన్నిరకాల వస్తువులను (దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్) సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ (Centralized Procurement) విధానం ద్వారానే సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల కొనుగోలు ప్రక్రయలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
జూన్ 15 లోపు యూనిఫాంల పంపిణీ..
వచ్చే విద్యా సంవత్సరం జూన్ 15వ తేదీ కల్లా విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా చూడాలని సీఎం అధికారులకు గడువు విధించారు. ఇందులో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం సూచించారు. మండల కేంద్రం నుంచి గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సక్రమంగా చేరుతున్నాయో లేదో పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.
శాఖల మధ్య సమన్వయం ఉండాలి..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖల మధ్య సమన్వయం లోపించకుండా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీని ద్వారా వనరుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు.
.
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్
హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..
Read Latest Telangana News And AP News And International News And Telugu News

