Dailyhunt
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

ఇంటర్నెట్ డెస్క్: కంటి నొప్పి (Eye pain) సాధారణంగా అలసట, ఇన్ఫెక్షన్లు, లేదా గాయాల వల్ల వస్తుంది. అయితే ఈ నొప్పి కంటికి సంబంధించినదా లేదా మెదడుకు సంబంధించినదా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చాలా మంది దీనిని తలనొప్పిగా భావించి పట్టించుకోరు. నొప్పి ఎక్కువైన తర్వాత మాత్రమే వైద్యులని సంప్రదిస్తారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, కంటి నొప్పి మాత్రమే ఉంటే, అది మెదడుకు సంబంధించిన సమస్య కావడం చాలా అరుదు. కానీ కంటి నొప్పితో పాటు కొన్ని ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉదాహరణకు.. నుదిటి నుంచి మెడ వరకు తలనొప్పి రావడం, తరచుగా తల తిరగడం, శరీరంలోని ఏదైనా భాగంలో తిమ్మిరి రావడం, పదేపదే వాంతులు కావడం.. ఈ లక్షణాలు మెదడులో వాపు లేదా కణితి వంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

కంటి నొప్పిని నివారించడానికి సూచనలు

  • ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.

  • మొబైల్ ఫోన్, టీవీ చూడటం తగ్గించాలి.

  • సరైన కంటి అద్దాలు ఉపయోగించాలి.

  • పోషకాహారం తీసుకోవాలి.

  • కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వాలి.

కంటి నొప్పి సాధారణ సమస్య అయినప్పటికీ, దీర్ఘకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

/span>

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

Read Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy