Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్వర్ యాత్ర తర్వాత హరిద్వార్‌లో భారీగా చెత్త.. 7 వేల టన్నుల వ్యర్థాలు..

కన్వర్ యాత్ర తర్వాత హరిద్వార్‌లో భారీగా చెత్త.. 7 వేల టన్నుల వ్యర్థాలు..

ఇంటర్నెట్ డెస్క్: శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ ఏడాది దాదాపు 5 కోట్ల మంది భక్తులు హరిద్వార్‌కు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు.

యాత్ర ముగిసిన తర్వాత ఘాట్లు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్లాస్టిక్, దుస్తులు, పూజలకు సంబంధించిన సామగ్రి పెద్ద ఎత్తున పేరుకుపోయింది (Haridwar 7000 Tonnes Garbage).

కన్వర్ యాత్ర ముగిసిన అనంతరం హరిద్వార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కనీసం 7,000 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. హర్ కీ పౌరీ వద్ద ఉన్న గదుల్లో వదిలిపెట్టిన నీటి సీసాల్లో మూత్రం నింపి ఉండటం కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని పారిశుద్ధ్య కార్మికులు చేతి తొడుగులు, మాస్కులు లేకుండానే తొలగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది (Kanwar Yatra Waste).

గంగాజలాన్ని సేకరించేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించే భక్తులు, తిరిగి వెళ్లేటప్పుడు అదే పవిత్ర నది పరిసరాలను చెత్తతో నింపడం విచారకరమని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు (Ganga Pollution). చెత్తను తొలగించేందుకు వందకు పైగా ఘాట్లలో పారిశుద్ధ్య సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులను శుభ్రం చేసే పనిలో పారిశుద్ధ్య సిబ్బంది నిమగ్నమయ్యారని మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. హరిద్వార్‌లోనే కాకుండా గంగోత్రి ప్రాంతంలో కూడా యాత్రికులు పెద్ద మొత్తంలో చెత్తను వదిలివెళ్లారు.

/span>

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..

భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy