Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌పై చర్యలు.. ఉమ్మెత్త విక్రయాలపై సీరియస్

కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌పై చర్యలు.. ఉమ్మెత్త విక్రయాలపై సీరియస్

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో విషపూరితమైన ధాతురా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను ఆహార విభాగంలో విక్రయించినట్లు గుర్తించడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కీలక చర్యలు తీసుకుంది.

అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌కు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది (Karnataka food licence suspended).

ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు విషపూరితమైనవని తెలిసినప్పటికీ, వాటిని కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మానవ వినియోగం కోసం విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లపై ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా ఉమ్మెత్త ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ ఉంచి, ఆన్‌లైన్‌లో విక్రయించడం లేదా పంపిణీ చేయడం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మెత్త ఉత్పత్తుల విక్రయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కర్ణాటక ఫుడ్ సేఫ్టీ శాఖ విచారణ చేపట్టింది (Datura sale Karnataka).

మూడు సంస్థల ప్రతినిధులు అధికారుల ముందు హాజరయ్యారు. అమెజాన్ ఈ వ్యవహారంపై తన స్పందనను ఇంకా సమర్పించలేదని అధికారులు తెలిపారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరిన్ని వివరాలు, తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు అదనపు సమయం కోరింది. బిగ్‌బాస్కెట్ ఇప్పటికే ఉమ్మెత్త పండ్ల ఆన్‌లైన్ విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి ఉత్పత్తులపై 'మానవ వినియోగానికి కాదు' అనే స్పష్టమైన లేబులింగ్ చేస్తామని సంస్థ పేర్కొంది (Toxic Datura fruits).

సంస్థలు ఇచ్చిన వివరణలను పరిశీలించిన అనంతరం అవి సంతృప్తికరంగా లేవని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ శాఖ పేర్కొంది (Datura seeds online). విషపూరిత ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను ఆహారంగా నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌కు సంబంధించిన ఫుడ్ లైసెన్సులను తదుపరి ఆదేశాల వరకు సస్పెండ్ చేసింది. ఈ సంస్థలకు సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 62 ఏళ్ల వరకు రిటైర్‌మెంట్ పెంపు

సాధిక్ ఖాన్ కరుడుగట్టిన నేరస్థుడు: విజయసాయి రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy