Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ.. కారణం ఇదే..

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ.. కారణం ఇదే..

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో దోపిడీ, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన నలుగురు పంజాబ్‌ మూలాలున్న యువకులను అక్కడి అధికారులు బహిష్కరించారు.

కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (CBSA) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్స్‌టార్షన్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 111 మందిని కెనడా నుంచి బహిష్కరించినట్టు తెలిపింది (Punjab-origin Indians deported).

తాజాగా బహిష్కరణకు గురైన నలుగురిని పాల్విందర్ సింగ్, జస్మేర్ సింగ్, అమితోజ్ బజ్వా, సాహిబ్‌జోత్ సింగ్‌గా గుర్తించారు. వీరికి ఎక్స్‌టార్షన్‌కు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు కెనడా అధికారులు పేర్కొన్నారు. కెనడాలో ఉంటూ ఎక్స్‌టార్షన్, వ్యవస్థీకృత నేరాలు వంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించిన విదేశీయులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇతర ప్రభుత్వ సంస్థలు, పోలీసు విభాగాలు అందించే సమాచారం, సీబీఎస్‌ఏ స్వయంగా నిర్వహించే దర్యాప్తులు, ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేసులను పరిశీలిస్తున్నారు (Canada extortion cases).

కెనడా ప్రస్తుతం వలస నిబంధనలకు అనుగుణంగా లేని వ్యక్తులను భారీగా దేశం నుంచి బహిష్కరిస్తోంది (Indian students Canada). సీబీఎస్‌ఏ ప్రకారం.. ప్రతి వారం సుమారు 400 మంది అర్హత లేని లేదా దేశంలో కొనసాగడానికి అనుమతి లేని వ్యక్తులను బహిష్కరిస్తున్నారు. గత ఏడాది కెనడా మొత్తం 23,160 మంది అనుమతిలేని వ్యక్తులను దేశం నుంచి తొలగించింది. వీరిలో 1,010 మంది తీవ్రమైన నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, జాతీయ భద్రత లేదా మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాలతో అనర్హులుగా తేలారు.

/span>

హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy