ఇంటర్నెట్ డెస్క్: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చే ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. కేరళ పేరు మార్పు బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది.
దీంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ బిల్లు ఆమోదం పొందింది. 'కేరళ (పేరు మార్పు) బిల్లు-2026'ను లోక్‌సభ మంగళవారం ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదించింది (Kerala Name Change).
రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కోరుతూ కేరళ శాసనసభ 2024లో తీర్మానం చేసింది. మలయాళంలో రాష్ట్రాన్ని సాధారణంగా 'కేరళం'గా పిలుస్తుండగా, రాజ్యాంగంలోని అధికారిక పేరు మాత్రం 'కేరళ' అనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మలయాళ స్థానిక ఉచ్ఛారణకు అనుగుణంగా అధికారిక పేరును మార్చాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం 2026 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది (Kerala to Keralam).
అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తూ పేరు మార్పు బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారు (Kerala Name Change Bill 2026). రెండు సభల్లోనూ బిల్లు ఆమోదం పొందడంతో, తదుపరి రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రం అధికారిక పేరు 'కేరళం'గా మారనుంది. ఇందుకోసం రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరును సవరించాల్సి ఉంటుంది.
/span>
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..
భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

