Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి

ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అభిమానులు గల్ఫ్ దేశాలలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఖతర్‌లో శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారథి గురువారం దోహాకు చేరుకున్నారు.

అల్ జజీరా అకాడమీ ఆవరణలో నిర్వహించే మహానాడులో మంత్రి ప్రార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. మంత్రికి దోహా విమానశ్రాయంలో తెలుగుదేశం ప్రవాసీ నాయకులు మద్దిపొటి నరేశ్, విక్రం సుఖవాసి, రవి పనుగుమటి, గోపాల కృష్ణా చౌదరి, కొడాలి సుధాకర్, సతీష్, సత్యనారాయణలు స్వాగతం పలికారు.

వివిధ వర్గాల తెలుగు ప్రవాసీయులను కలుసుకొన్న మంత్రి ప్రార్థసారథి గురువారం సాయంత్రం ఖతర్‌లోని వ్యాపారవేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy