Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

హైదరాబాద్‌: నగరంలో క్యూర్‌ (ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతం) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త పథకానికి పేరు సూచించాలంటూ బోర్డు కోరుతోంది.

మంచి పేరు సూచించిన వారికి రూ.1 లక్ష బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ప్రజల నుంచే పేరు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 28 వరకూ సోషల్ మీడియా వేదికగా పోటీ నిర్వహించనున్నారు. tghd.official ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆసక్తి ఉన్న వారు లక్ష ఇళ్ల పథకానికి మంచి పేరు సూచించి బహుమతిని సొంతం చేసుకోండి మరి.

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో లక్ష ఇళ్ల ప్రాజెక్ట్..

క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల కేటాయింపును లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో పూర్తి మార్గదర్శకాలను కూడా సూచించనున్నారు. ఇందులో ప్రజలను భాగస్వాములుగా చేసేందుకు హౌసింగ్ బోర్డు.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy