Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు

కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు

విజయవాడ: అదృశ్యమైన సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయడానికి నియమితులైన దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్‌ నేడు విజయవాడకు చేరుకోనున్నారు.

సాయికృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్న దర్యాప్తు అధికారి, ముందుగా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలవనున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్నారు.


ఆస్పత్రులపై నిఘా పెంచాం

మలేషియాకు మంత్రి నారాయణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy