Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ఆడాలంటే నిబంధనల ప్రకారం 11 మంది ఆటగాళ్లు ఉండాల్సిందే. కానీ ఆటపై ఆసక్తి ఉంటే పరిస్థితులకు తగ్గట్టు నియమాలను పక్కన పెట్టేసి ఆటను ఆస్వాదించొచ్చని ఈ చిన్నారులు నిరూపించారు.

కొండ ప్రాంతంలో కొందరు పిల్లలు ఎంచెక్కా క్రికెట్ ఆడుతుండగా.. వారికి ఫీల్డర్లుగా శునకాలు తోడవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సరదా వీడియో నెటిజన్ల హృదయాలను ఆకర్షిస్తోంది.

ఎక్కడో కొండల నడుమ రాళ్లతో నిండిన ఓ చిన్న ప్లేస్‌ను క్రికెట్ ఆడేందుకు ఎంచుకున్నారు నలుగురు చిన్నారులు. వీరిలో ఒకరు బ్యాటింగ్ చేస్తుండగా, మరొకరు బౌలింగ్‌కు దిగారు. మిగతా ఇద్దరిలో ఒకరు వికెట్ కీపర్‌గానూ, ఇంకొకరు ఫీల్డింగ్ స్థానంలో నిల్చున్నారు. ఇలా ఆ చిన్నారులు ప్లాన్ చేస్కుని క్రికెట్ ఆడుతుండగా.. వీరికి రెండు కుక్కలు తోడై ఆటకు మరింత ఆకర్షణను తీసుకువస్తూ తమ బాధ్యతను నెరవేర్చాయి. బంతి అలా వాటి వైపు వచ్చిందో లేదో వెంటనే అడ్డుకుని చక్కగా ఫీల్డింగ్ చేశాయి. నోటితో చక్కగా క్యాచ్‌లందుకుంటున్న దృశ్యాలూ కనిపించాయి. ఓవైపు బాలలు జాగిలాలో ఎంచెక్కా క్రికెట్ ఆడుతుండగా.. మరోవైపు కొన్ని పశువులు మేత మేస్తున్న దృశ్యాలు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ఈ వీడియోను ఎక్కడ తీశారనే విషయం తెలియదు గానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ప్రకృతి ఒడిలో పిల్లలు, కుక్కలు కలిసి క్రికెట్ ఆడిన ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఇలాంటి ఫీల్డింగ్‌కు నిజంగా చప్పట్లు కొట్టాల్సిందే', 'కుక్కలకు తమ పనేంటో బాగా తెలుసు' అని కొందరు కామెంట్ చేయగా.. 'ఇదే అసలైన చిన్ననాటి ఆనందం', 'సోమవారం మీటింగ్‌లకు బదులు కొండల్లో ఇలా క్రికెట్ ఆడితే ఎంత బాగుంటుందో' అని మరికొందరు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఓ సాధారణ క్రికెట్ మ్యాచ్‌ను 2 శునకాలు చురుకైన ఫీల్డింగ్‌తో మరింత ప్రత్యేకంగా మార్చగా.. ఈ హృద్యమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఆకర్షిస్తూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవీ చదవండి:

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

రాహుల్ ప్రచారం చేసినా.. అంత స్పందన ఎందుకు రాలేదు?: థరూర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy