Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు.

ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోవడంతో జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై దాస్‌గుప్తా తీవ్రంగా స్పందించాడు. కుల్‌దీప్‌కు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు.

ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్ తరఫున ఇంగ్లండ్‌లో వన్డే క్యాంప్ మ్యాచ్‌లు ఆడుతున్న కుల్‌దీప్.. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్‌తో కలిసి స్పిన్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన దాస్‌గుప్తా.. 'కుల్‌దీప్ తప్పకుండా తుది జట్టులో ఉండాలి. శ్రీలంక పరిస్థితులను బట్టి ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. నేను ఇంగ్లండ్‌లో కుల్‌దీప్ బౌలింగ్ చూశాను. నాతో పాటు చాలా మంది చూశారు. కానీ జట్టును ఎంపిక చేసే వారు మాత్రం చూడలేదు. అదే అసలు సమస్య' అంటూ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం స్పిన్ విభాగం సమతూకంగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత ఒత్తిడి కంటే.. పరిస్థితులకు అనుగుణంగా ఉత్తమ జట్టును ఎంపిక చేయడంపైనే భారత జట్టు దృష్టి పెట్టాలని దాస్‌గుప్తా సూచించారు.

strong>

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy