Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవదహనం

లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవదహనం

నంతపురం, జూన్ 26: ఉరవకొండ మండలం బూదగవి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి.. రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది.

అనంతరం లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఓబుల్‌రెడ్డి సజీవ దహనం అయ్యారు. క్లీనర్ పుల్లయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విడపనకల్లు పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. లారీలో చెలరేగిన మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కడప జిల్లా పులివెందుల సమీపంలోని కనుమపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై లారీ డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వైసీపీ హయాంలో ఎన్నో అపచారాలు

సైబర్‌ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్‌

For More AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy