Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL ) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్‌ గోయెంకానే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

లలిత్ మోదీ మాట్లాడుతూ.. 'అతడికి ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే అర్హత కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక వ్యాపార మనసత్వం కలిగిన వ్యక్తి. అతడు తన విద్యుత్ బిజినెస్ కే పరిమితం అవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్‌లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లనవూ సూపర్‌ జెయింట్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. ఎల్ఎస్‌జీ జట్టు కూడా ప్రతీ సీజన్‌లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా ఆ జట్టు ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్‌కు దొరికిపోయాడు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ మారాడు.' అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాంగా మాట్లాడాడు.

గోయెంకాపై వచ్చిన మీమ్స్‌లో అత్యధిక మంది చూసిన మీమ్‌కు రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానంటూ లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్‌పై లలిత్ మోదీ కామెంట్స్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. 'పంత్‌కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఆ పెద్ద మనిషి తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు' అంటూ ఆరోపణలు సంధించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy